calender_icon.png 10 March, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20 శాతం నిధులు కేటాయించాలి

10-03-2025 12:04:47 AM

డీటీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ్యూల్

మంచిర్యాల, మార్చి 9 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు  బలహీన వర్గాలు చదివే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి విద్య శాఖ కు బడ్జెట్ లో 20 శాతం నిధులు కేటాయించాలని డి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ్యూల్ అన్నారు.

ఆదివారం సి వీ రామన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య శాఖ కి చైర్మన్ గా నియమించిన ఆకునూరీ మురళి త్వరగా ఒక కూలంకుశ రిపోర్ట్ ను ప్రభుత్వ బడులను కాపాడే ఒక నిర్ధిష్టమైన రిపోర్టును ఇవ్వాలని కోరారు.  అనంతరం నూతన జిల్లా కమిటీనీ ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షుడుగా అసంపల్లీ రమేష్, ఉపాధ్యక్షులుగా బీ కుమార్, నాగలక్ష్మి, పత్తి సంతోష్ లు ప్రధాన కార్యదర్శి గా మోతే జయకృష్ణ,జిల్లా కార్యదర్శులుగా ప్రకాష్, కళావతి, అప్పారావు, రాజన్నలు, రాష్ట్ర కౌన్సిలర్ లుగా జాకీర్ హుస్సేన్, చిలుక, సంతోష్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు శ్యామ్, సీనియర్ నాయకులు కొండయ్య, జిల్లాలోని వివిధ మండలాల బాధ్యులు విష్ణువర్ధన్, సత్యనారాయణ, శ్రీనివాస్, సంతోష్, శంకర్, ఆంజనేయులు, వెంకటస్వామి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.