calender_icon.png 12 October, 2024 | 5:43 AM

66 శాతం పెరిగిన ‘క్రెడ్’ ఆదాయం

01-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్స్ యాప్ క్రెడ్ (సీఆర్‌ఈడీ) ఆదాయం భారీగా పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2473 కోట్ల ఆదాయం నమోదు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 66 శాతం వృద్ధి నమోదైంది. మానటైజ్డ్ సభ్యులు పెరగడం, యూజర్ నుచేర్చుకునే ఖర్చు తగ్గడం ఇందుకు కారణం.

అంతేకాదు నిర్వహణ నష్టాలు సైతం రూ.1024 కోట్లతో పోలిస్తే రూ.609 కోట్లకు తగ్గినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాదితో పోలిస్తే మానటైజ్డ్ మెంబర్ల సంఖ్య 58 శాతం మేర పెరిగిందని సంస్థ వ్యవస్థాపకుడు కునాల్ షా పేర్కొన్నారు.