calender_icon.png 23 December, 2024 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్‌లో 12.6 శాతం

15-10-2024 01:58:17 AM

పెరిగిన వాహన విక్రయాలు

ముంబయి: సెస్టెంబర్ నెలలో వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ గత నెలలో జరిగిన వాహనాల విక్ర యాల సంఖ్యను విడుదల చేసింది. గత నెల లో వాహనాల అమ్మకాలు 24,62,431 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకా లు గత ఏడాదితో పోలిస్తే 12.6 శాతం ఎక్కు వ.

2024 సెప్టెంబర్‌లో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 3,56,752 యూని ట్లు. గత ఏడాది ఇదే నెలతో ఈ వాహనాల అమ్మకాలు 3,61,717ఆ ఉంది. 2023 సెప్టెంబర్ నెలకంటే కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కాస్త మందగించాయి.

ఇక ద్విచక్ర వాహనాల అమ్మకాలు మొత్తం 20,25,993 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో టూవీలర్ వాహనాల అమ్మకాలు 17,49,794 మాత్రమే. దీన్ని బట్టి గత నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయని అర్థమవుతుంది.