calender_icon.png 9 October, 2024 | 11:45 PM

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్లలో 15 శాతం వృద్ధి

05-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్లు ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో 15.4 శాతం వృద్ధిచెంది రూ.23.53 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదేకాలంలో ఇవి రూ. 20.38 లక్షల కోట్లు. 2024 జూలై-సెప్టెంబర్‌లో రుణాలు 7 శాతం పెరిగి రూ.23.54 లక్షల కోట్ల నుంచి రూ.25.19 లక్షల కోట్లకు చేరినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.