ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమా సికంలో రూ.3593 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1341 కోట్ల నికర లాభంతో పోలిస్తే దాదాపు 168 శాతం పెరగడం గమనార్హం. జులైలో చేపట్టిన టెలికాం టారిఫ్‌ల సవరణ ఎయిర్‌టెల్‌కు బాగా కలి సొచ్చిం ది.
గత త్రైమాసికంతో (రూ.4159 కోట్లు) పోలిస్తే లాభం 13.6 శాతం తగ్గడం గమనార్హం. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సైతం 12 శాతం వృద్ధితో రూ.37,044 కోట్ల నుంచి రూ.41,473 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింలో తెలిపింది.
ఇతర ఆదాయం రూ. 254 కోట్లు వచ్చినట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయంరూ.203 నుంచి రూ. 233కి పెరగడం గమనార్హం. ఎయిర్‌టెల్ యూజర్ల నెలకు సగటున 23.9 జీబీ డేటాను వాడుతున్నట్లు సంస్థ పేర్కొంది.