calender_icon.png 27 September, 2024 | 12:50 PM

సవాళ్లున్నా 7 శాతం వృద్ధి

23-09-2024 12:00:00 AM

భారత్ జీడీపీపై డెలాయిట్ అంచనా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నప్పటికీ, భారత్ ఈ ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని సాధిస్తుందని అంతర్జాతీయ అకౌంటింగ్, కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ అంచనా వేసింది. భారత్‌లో ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నదని, గ్రామీణ డిమాండ్ పెరుగుతున్నదని, వాహన విక్రయాలు మెరుగుపడు తు న్నాయని డెలాయిట్ దక్షిణాసియా సీఈవో రోమాల్ శెట్టి తెలిపారు.

అంతర్జాతీయ సవాళ్లున్నా, భారత్ మెరుగైన పరిస్థితిలో ఉన్నద ని, ఈ కారణంగా ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి కనపరుస్తుందని డెలాయిట్ అంచనాల్లో పేర్కొంది. వచ్చే 2025 జీడీపీ 6.7 శాతం వృద్ధిచెందుతుందని అంచనా వేసింది. యూఎస్ రేట్ల కోత భారత్‌కు సానుకూలమని, గ్లోబల్ ఆయిల్ ధరల తగ్గుదల ఆర్థిక వ్యవస్థకు మే లు చేస్తుందని శెట్టి తెలిపారు. అంతర్జాతీయంగా భారత్ ఆధిపత్యం వహిస్తున్న సర్వీ సులు రంగంపై , దిగుబడిని పెంచేందుకు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ఉపయోగించడంపై దృష్టిపెట్టాలని సూచించారు. 

30 వేల డాలర్లకు తలసరి ఆదాయం పెరగాలి

భారత్ ధనిక దేశంగా ఆవిర్భవించగలుగుతుందా అన్న ప్రశ్నకు శెట్టి స్పందిస్తూ అందు కోసం దేశంలో ప్రస్తుతం 2,500 డాలర్లు ఉన్న తలసరి ఆదాయం 20,000 డాలర్లకు పెరగాలన్నారు. నిర్దిష్ఠస్థాయిని మించి తలసరి ఆదాయం పెరిగితే ఆర్థికాభివృద్ధి వేగవం తం అవుతుందన్నారు. తలసరి ఆదాయం 5,000 డాలర్లకు చేరితే మరింత వినియో గం పెరుగుతుందని, అప్పుడు ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారతాయన్నారు. దేశం మ రింత స్వయం సమృద్ధిని సాధిస్తుందన్నారు.