calender_icon.png 24 September, 2024 | 3:57 AM

40శాతమే రైతు రుణమాఫీ

24-09-2024 01:51:50 AM

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

హుజూరాబాద్, సెప్టెంబరు 23: ఆగస్టు 1 5 వరకు ఒకే దఫాలో రెండు లక్షల రుణమా ఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి రూ. 49 వేల కోట్లకు గాను రూ.17 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని, పూర్తిస్థాయి లో రుణమాఫీ ఎక్కడ జరిగిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 47 లక్షల మందికి రుణమాఫీ చేస్తా మన్న సీఎం రేవంత్‌రెడ్డి కేవలం 22 లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారని అన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రైతు రుణమాఫీ 40 శాతం మంది రైతులకు మా త్రమే చేశారని విమర్శించారు. రైతుబంధు ఇప్పటి వరకు ఇవ్వలేదని, ఇంకా కొన్ని రో జులు అయితే పంటలు కోతలు కూడా పూర్తవుతాయని అన్నారు. రైతులందరికీ షరతు లు లేకుండా రైతు భరోసా ఇవ్వాలని డిమా ండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ నాయకులను, సీఎంను బయట తిరగనివ్వబోమని హెచ్చరి ంచారు. రెండవ విడత దళితబంధు ఇవ్వకుం  టే దళితులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తా మన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బో యినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు ఉన్నారు. 

రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతులు

కామారెడ్డి, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): ఎలాంటి షరుతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న విజయపాల ఉత్పత్తిదారులకు బకాయిలను చెల్లించాలని రైతులు కోరారు. సోమవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. రుణమాఫీకాని రైతులకు కొర్రీలు పెడుతూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు తప్ప ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాల బిల్లులు 5 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.