న్యూఢిల్లీ, డిసెంబర్ 10: వివిధ స్థూల ఆర్థికాంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేప థ్యంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా నవంబర్ నెలలో ఈక్విటీ మ్యూచువ ల్ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు అక్టోబర్ తో పోలిస్తే 14 శాతం తగ్గాయి. మంగళవారం అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ప్రకారంనవంబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి రూ.35,943 కోట్ల పెట్టుబడులు వచ్చా యి. అక్టోబర్‌లో ఈ పెట్టుబడులు రూ. 41,887 కోట్లు.
నవంబర్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లోకి రూ.25,320 కోట్ల నిధులు వచ్చాయి. సిప్‌ల్లో పెట్టుబడులు అక్టోబర్‌తో పోలిస్తే ఫ్లాట్‌గా ఉన్నాయి. మొత్తంగా నవంబర్‌లో ఫండ్ పరిశ్రమ రూ. 60,295 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో వచ్చిన రూ. 2.4 లక్షల కోట్ల నిధులతో పోలిస్తే నవంబర్‌లో తగ్గాయి. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడు లు రూ. 1.57 లక్షల కోట్ల నుంచి రూ.12,915 కోట్లకు పడిపోవడమే ఇందుకు కారణం. నవంబర్ నెలలో మొత్తం మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో రూ.68 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి.