calender_icon.png 17 January, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి

27-08-2024 12:12:43 AM

బీసీ సంఘాల డిమాండ్

వనస్థలిపురంలో దీక్షను భగ్నం చేసిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో(విజయక్రాంతి)/ఎల్బీనగర్, ఆగస్టు 26: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని కోరుతూ వనస్థలిపురం జడ్డెస్ కాలనీలో బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్, బీసీ హిందూ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్, రజక రిజర్వేషన్ పోరాటసంఘం అధ్యక్షుడు చాప ర్తి కుమార్‌గాడ్గే చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం రెండో రోజుకు చేరింది.

బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఆదివారం తమను అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచుకుని, దుండిగల్ మండలం మల్లంపేట కమ్యూనిటీ హాల్ వద్ద వదిలిపెట్టారని తెలిపారు. సోమవారం కూడా అదుపులోకి నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వనస్థలిపురం సహా పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రకటన వచ్చేవరకు ఉద్యమిస్తామని బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. 

హామీని నెరవేరుస్తాం: తీన్మార్ మల్లన్న 

బీసీ సంఘాల నాయకులు చేపట్టిన ఆమరణ దీక్షకు సోమవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిందని, రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తామని చెప్పారు. కులగణన, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతోందని తెలిపారు. ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్‌పాటు కేంద్ర కిషన్‌రెడ్డి బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటనలు చేయలేదని, ఇప్పటికైనా బీఆర్‌ఎస్, బీజేపీ స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.

బీసీల దీక్షకు బీ ఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్ర వీణ్‌కుమార్ ఎక్స్ వేదికగా మద్దతు తెలిపా రు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు కదిరే కృష్ణ, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు, కెవిగౌడ్, బీసీ నాయకులు కటకం నర్సింగ్‌రావు, అవ్వరు వేణుకుమార్, వాసుకే యాదవ్, కోట్ల వా సు, మహేష్‌గౌడ్, నరహరి మద్దతు తెలిపారు.