02-04-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): అగ్రవర్ణాలకు10 శాతం రిజర్వేషన్ లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం అదే తరహాలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తరతరాలుగా అన్యాయానికి గురువుతున్న అణగారిన వర్గాలకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్ర శాసన సభ చేసిన తీర్మానాన్ని ఈ పార్లమెంట్ సమావేశాలల్లో ఆమోదింప జేయాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకులదేనని, లేకపోతే వారిని రాష్ట్రంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ మేరకు మంగ ళవారం బషీర్‌బాగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు తరహలో 9వ షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్లు చేర్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని ఆయన కోరా రు. బీజేపీ రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్ద తు ఇవ్వగా, ముస్లిం రిజర్వేషన్ల సాకుతో కేం ద్రంలోని బిజెపి ప్రభుత్వం ద్వంద విధానాలు అవలంభిస్తోందన్నారు.
దీనిని అడ్డు కోవాల్సిన బాధ్యత కేంద్రమంతులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు 6 మంది ఎంపిలదేనని అన్నారు. అగ్రవర్ణ రిజర్వేషన్లకు ఒక న్యాయం, బీసీ రిజర్వేషన్లకు ఇంకొ క న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు.
పార్లమెంట్‌లో బీసీ బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ అగ్ర నాయకులను ఒప్పించే బాధ్యతను తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీసీ ఉద్యమ నాయకుడిగా చెప్పకునే రాజ్యసభ సభ్యలు ఆర్‌కృష్ణయ్యలు తీసుకోవా లన్నారు.
42 శాతం బీసీ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన అనంతరమే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తెలంగాణాలో అడుగుపెట్టాలని, లేనట్లయితే ప్రజలు వారిని తరిమితరిమి కొడతా రని ఆయన హెచ్చరించారు.