హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్ష తెలంగాణ సెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొదటి సెషన్‌లో జరిగిన పరీక్షలకు 75.5 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 12 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలిరోజు పరీక్షలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ప్రారంభించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 33,764 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 24 సీబీటీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.