హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బి)శనివారంనిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్ల (స్టాఫ్ నర్స్) పరీక్షకు 95.69శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 42,244 మంది దరఖాస్తు చేయగా.. 40,423 మంది పరీక్షకు హాజరైనట్లు ఎంహెచ్ఎస్ఆర్బీ మెంబర్ సెక్రెటరీ తెలిపారు.