హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): మహిళా శిశు సంక్షేమ శాఖ లోని సీడీపీవో పోస్టుల పరీక్షలకు 38 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యా రు. ఈ నెల 3, 4 తేదీల్లో ఈ పరీక్షలు జరిగినట్టు టీజీపీఎస్సీ తెలిపింది. శనివారం జరిగిన పేపర్ 3,799 (38.35 శాతం), పేపర్ 2కు 3,787 (38.23 శాతం) మంది హాజరయ్యా రు. ఈ నెల 3న పేపర్ పరీక్షకు 4,169 (42.09 శాతం), పేపర్ 2కు 4,155 (41.95 శాతం) మంది హాజరయ్యారు. 23 పోస్టులకు మొత్తం 19,812 మంది దరఖాస్తు చేసుకున్నా రు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించారు.