బంగారు పుస్తెలతాడు చోరీకి యత్నం
మహిళా దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు
గజ్వేల్, సెప్టెంబర్ 3: గజ్వేల్ పట్టణంలోని డబుల్‌బెడ్‌రూం ఇండ్లలో నివాసముంటున్న సింగారం గ్రామానికి చెందిన కమలమ్మ ఇంట్లో మంగళవారం మరో మహిళ చడీచప్పుడుకాకుండా చొరబడి.. కమలమ్మ కంట్లో కారం కొట్టింది. ఆమె వద్ద ఉన్న 4తులాల బంగారు పుస్తెల తాడు లాక్కొని ఇంటి నుంచి బయటకు పరుగెత్తింది. ఈ క్రమంలో చోరీకి యత్నించిన మహిళను గమనించిన స్థానికులు పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.