11-04-2025 01:15:10 AM
కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.సుభాష్ నగర్ మెయిన్ రోడ్డులో గల హనుమాన్ టెంపుల్ నుండి పాదయాత్ర ప్రారంభమై 1,2,20,23 డివిజన్ల మీదుగా రెడ్డి గార్డెన్ వరకు కొనసాగింది.
ఈ పాదయాత్రను ఉద్దేశించి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కి వంద సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ అధ్యక్షుడిగా ఉండి స్వాతంత్య్ర పోరాటం చేసిన సంగతి ఈ తరానికి తెలుపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ మరియు భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర కొనసాగుతుందని నరేందర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్,తాజా మాజీ కార్పొరేటర్ ఆర్ష కిరణ్మయి మల్లేశం, మెతుకు కాంతయ్యా, అనిల్, అటెపు వేణు, లింగమూర్తి, జంగపెల్లి మల్లయ్య, కాశెట్టి శ్రీనివాస్, దామోదర్, గుండటి శ్రీనివాస్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.