06-04-2025 12:28:11 AM
కడ్తాల్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి) : కడ్తాల్ మండలంలో జనం గుండెచప్పుడుగా రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయని అ ట్రస్ట్ చైర్మన్ దశరథ్ నాయక్ అన్నారు. ఈ నెల 3న కడ్తాల్ మండలంలోని ముద్విన్, చరికొండ గ్రామ పంచా యతీలలో పర్యటించి బోయిన్ గుట్ట తండా లో నిర్వహించిన సభను విజయవంతం చేసిన ప్రజలకు, ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డిని శనివారం కడ్తా ల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ నగరంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారి నివాసాల్లో కలిసి శాలువాలతో సన్మానించారు.
కడ్తాల్‌లో హరీశ్‌రావు పర్యటనతో బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందని త్వరలోనే జరిగే స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ సత్తా ఏమిటో చాటుతామని తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ ఎస్టీ కమిషనర్ రాం పాల్ నాయక్ మాజీ సర్పంచ్ లాల్ కోట నర్సింహా గౌడ్ నాయకులు అంజి నాయక్, ఈశ్వర్ నాయక్, శ్రీను నాయక్, ప్రశాంత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.