09-03-2025 08:26:27 PM
హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి...
ఎల్బీనగర్: ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉన్నదని కార్పొరేట్ కళ్లెం నవజీవన్ రెడ్డి అన్నారు. కార్పొరేటర్ ఆధ్వర్యంలో సుప్రజా హాస్పిటల్ సహకారంతో హయత్ నగర్ వార్డు కార్యాలయంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు (రక్తపోటు, మధుమేహం), ఉచితంగా మందుల పంపిణీ, ఉచితంగా డయాగ్నోస్టిక్ సేవలు, 2డీ ఈకో, ఈసీజీ, జీఆర్బీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... హయత్ నగర్ డివిజన్ ప్రజల ఆరోగ్యం మా బాధ్యత అన్నారు.
దాదాపు 200 మంది ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన సుప్రజా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్, వైద్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీను, జీవన్ అన్న మిత్రబృందం సభ్యులు పాండల శ్రీధర్, శ్రీకర్ణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి సంఘీ అశోక్, నాయకులు వస్పరి వెంకటేశ్, సురేశ్, నర్సింహ రెడ్డి, అరుణ్, బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు ఎర్ర ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.