చెన్నూరు ఎమ్మెల్యే వివేక్...
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా ఉంటుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆన్నారు. బుధవారం పట్టణంలోని యాపల్ 22 వార్డులోని పాత్రికేయుడు అవునూరి కుమార్ ను ఆయన పరామర్శించారు. కుమార్ తల్లి లక్ష్మి ఇటీవలే గుండెపోటుతో మృతి చెందగా, పాత్రికేయులు కుమార్ గుండెపోటుకు గురై కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స పొంది తన నివాసానికి చేరుకోగా విషయం తెలుసుకున్న చెన్నూరు ఎమ్మెల్యే కుమార్ నివాసంలో ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని తాను అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం వార్డులో పర్యటించారు. ప్రజలు తమ సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ అంబేద్కర్ సేన జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సట్ల సంతోష్, వీరన్న తుంగపిండి విజయ్, బండి శంకర్, రాచర్ల గణేష్, రాయబారపు కిరణ్, ఎండి జావిద్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిప్పకుర్తి శశిధర్ లు పాల్గొన్నారు.