కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): ఇంటి పెద్ద ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం మొత్తం ఆనందంగా ఉం టుందని.. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు.
శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి జన్మదినోత్సం సందర్భంగా కార్ఖానా లోని శ్రీమహంకాళి ఆలయ ప్రాంగణంలో సుమారు 300 మంది పురోహితులతో కలిసి లక్ష్మీగణపతి యాగం, మృత్యుంజయ యాగం, నవ చండీయాగం, శతరుద్ర యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు రెండు వేల మందికి అన్నదానం చేశారు.
అనంతరం యాగంలో పాల్గొన్న అర్చకులకు నిత్యావసర వస్తువులు, దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంపన్న ప్రతాప్, ముప్పిడి మధుకర్, బద్రి యాదవ్, బలవంతరెడ్డి, సదానంద్, సంతోష్యాదవ్, సరిత తదితరులు పాల్గొన్నారు.