10-04-2025 01:53:17 AM
ఆదర్శరెడ్డి పాదయాత్ర విజయవంతం మాజీ మంత్రి హరీశ్ రావు
పటాన్ చెరు, ఏప్రిల్ 9 : పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్ గా ఎన్నికైన ఆదర్శ్ రెడ్డి బుధవారం పాద యాత్ర నిర్వహించారు. రామచంద్రాపురం పట్టణం నుంచి రుద్రారం గణేష్ గడ్డ ఆలయం వరకు చేపట్టిన పాదయాత్రలో పటాన్ చెరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గణేష్ గడ్డ దేవాలయంలో జిల్లా, నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. ఏడాదిలోనే రేవంత్ రెడ్డి పాలనపై విరక్తి చెందారని తెలిపారు.
ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొనసా గించిన పథకాలను అమలు చేయలేక చితికిలా పడిందన్నారు. ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బహిరంగ సభకు ని యోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ గా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మల్కాపురం శివకుమార్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి,
తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ లలిత సోమిరెడ్డి, నాయకులు కొలను బాల్ రెడ్డి, వెంకటేశం గౌడ్, గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి, బీఆర్‌ఎస్ మండల, పట్ట ణ మున్సిపల్ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.