వినాయకుని షెడ్డు స్థలం ఆక్రమణకు యత్నం...
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తిలో గల 4వ వార్డులో వినాయకుని షెడ్డు నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని ఆదివారం సాయంత్రం కొందరు ఆక్రమించే ప్రయత్నం చేయడం స్థానికంగా వివాదాస్పదమైంది. గతంలో పనిచేసిన కౌన్సిలర్ బస్తి ప్రజలకు వినాయకుని షెడ్డు నిర్మాణం కోసం ఆ స్థలాన్ని కేటాయించడంతో కొన్ని సంవత్సరాలుగా అక్కడ గణపతి నవరాత్రులను నిర్వహిస్తున్నారు. కాగా ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ ప్రహరీ నిర్మిస్తుండడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.