calender_icon.png 23 October, 2024 | 1:53 PM

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..

23-10-2024 11:17:10 AM

పేకాట ఆడుతున్న 9 మంది అరెస్ట్ 

బెల్లంపల్లి, (విజయక్రాంతి): కన్నెపల్లి మండలంలోని వీగాం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసినట్లు కన్నెపల్లి ఎస్సై ఏ. గంగారం తెలిపారు. వీరి వద్ద నుండి రూ.750 నగదుతో పాటు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో వీగాం గ్రామానికి చెందిన గాండ్ల మల్లేష్, గుజ్జ గుండయ్య, సాయిల్ల భీమేష్, నన్నా రాకేష్, నస్పూరి రమేష్, నన్నా వెంకటేశం, గుజ్జ శంకర్, నన్నా రాజేష్, గాండ్ల రామకృష్ణలు ఉన్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగారం తెలిపారు.