calender_icon.png 30 September, 2024 | 8:53 AM

హైడ్రాను ప్రజలు స్వాగతిస్తున్నారు

30-09-2024 02:42:56 AM

హైదరాబాద్‌లోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తున్నం

మూసీ లేక్‌సిటీ డెవలప్‌మెంట్‌పై ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు

సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

సిద్దిపేట, సెప్టెంబరు 29 (విజయక్రాంతి): హైడ్రాను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని, కేవలం ప్రతిపక్షం మాత్రమే వ్యతిరేకిస్తూ ప్రజలను రెచ్చగోడుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని దీర్ఘకాలిక సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తున్నా మన్నారు.

ఆదివారం మంత్రి  పొన్నం సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లా డారు. మూసీ సుందరీకరించడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని, అందుకే సోషల్ మీడి యా వేదికగా తప్పుడు ప్రచారాలకు ఒడిగడుతున్నారన్నారు. ప్రజలు ఈ అసత్య ప్రచా రాలను నమ్మొద్దని సూచించారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో చిన్నపాటి వర్షం కురిస్తే ఇండ్లల్లోకి నీరొచ్చేవన్నారు.

నాళాల్లో ప్రజలు కొట్టుకుపోయిన దాఖలాలు కూడా ఉన్నాయన్నారు. మూసీ బాధితులకు అవగాహన కల్పించి, వారికి ప్రత్యామ్నాయం చూయించిన తర్వాతే ఖాళీ చేయిస్తున్నామన్నారు. మూసీ బాధితుల పట్ల హరీశ్‌రావు రాజకీయం చేయడం తగదని హితువు పలికారు. మూసీ సుందరీకరణ ద్వారా పర్యటక రం గం మరింత అభివృద్ధి చెందుతుందని, ఇం దుకు ప్రజలంతా సహకరించాలన్నారు.

గతంలో తమకు నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా ఇవ్వని బీఆర్‌ఎస్.. ఇప్పుడు వేదాలు వళ్లిస్తుందని విమర్శించారు. అధికారం కోల్పో యిన బీఆర్‌ఎస్ ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతుందన్నారు. సమావేశంలో టీపీసీసీ సభ్యులు దరిపల్లి చంద్రం, నాయకులు యాదగిరి, హరికృష్ణ, ఇమామ్ పాల్గొన్నారు.