25 May, 2026 | 5:16 AM

హిందూ సమ్మేళనానికి పోటెత్తిన ప్రజలు

25-05-2026 12:00 AM

ముషీరాబాద్, మే 24 (విజయక్రాంతి): గాంధీనగర్ ఆంధ్రాకేఫ్ చౌరస్తా వద్ద హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో హిందు బంధువులు, భక్తులు, రాష్ట్రీయ స్వ యం సేవక్ సంఘ్ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య తిథులుగా స్వామి శాంతానంద సరస్వతి, ప్రధాన వక్తలుగా సమాచార భారతి కోశాధికారి పులిగడ్డ రాఘవేంద్ర, అత్యధిక ప్రవచనకర్త కొముది వేదాంతం పాల్గొన్నారు.

హిందువుల ఐక్యతను ప్రభావితం చేసి, వాడవాడలా, గడప గడపకు హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, మన భారత దేశం పట్ల గౌరవాభిమా నం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకిత భావం, సేవాగుణం వంటి వాటిని వికసింప చేసేందుకు, హిందువులందరి భాగసామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళన ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌రామ్, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ. వినయ్‌కుమార్, రామకృష్ణ శాస్త్రి, వెంకటరమణ, డా. చంద్రశేఖర్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్నసాయిచంద్, శ్రీకాంత్, దామోదర్, వీఎస్టీ రాజు, పాల శ్రీనివాస్, ఎం. ఉమేష్, శ్రీనివాస్‌రావు, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, సాయికుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, సంతోష్, సంపత్ యాదవ్, సంయుక్త రాణి, సోమిశెట్టి శ్రీనివాస్, రాధాకృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు.