24-03-2025 12:46:04 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, మార్చి 23 : చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్ ఘాట్ ఓల్ విలేజ్లో శ్రీ భవాని సమేత నాగలింగేశ్వర స్వామి ఆర్చ్ ని ఆదివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికులు కలిసికట్టుగా కాలనీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు హాజరయ్యారు.