బెల్లంపల్లి (విజయక్రాంతి): ప్రజలు భక్తి మార్గంలో ప్రయాణించి శాంతియుత జీవనం అలవాటు చేసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సతీమణి గడ్డం రమ కోరారు. సోమవారం కన్నేపల్లి మండలంలోని టేకులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని తన కుమార్తె గడ్డం వర్షతో కలిసి సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఒత్తిడి మయమైన జీవితంలో ఆధ్యాత్మికత ఎంతో ప్రశాంతతని ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవితాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాధవరపు వెంకట నర్సింగరావు, రంగారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పాల శ్రీ రామాంజనేయులుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.