గజ్వేల్ (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారు అనారోగ్యంతో బాధపడే వారంతా ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని మర్కుక్ మాజీ ఎంపీపీ పాండు గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం శివారువెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం రోజున గతంలో అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకున్న బాలమణికి 34500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య,పెంటయ్య, మల్లేశం, కనకరాజు, యాదయ్య, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.