28-04-2025 12:55:00 AM
సూర్యాపేట, ఏప్రిల్ 27: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డీఎస్పీ పార్థసారథి సూచించారు. ఆదివారం పట్టణ పరిధిలోని భరోసా కేంద్రంలో సువెన్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..... పట్టణ పరిసర ప్రాంతాలలో ఎక్కువగా డయాబెటిస్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారి ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహాలను పాటిస్తూ పోషక విలువలు కలిగిన మంచి ఆహారాన్ని తీసుకొని, వ్యాయామాలు చేస్తూ వాటిని నివారించడానికి ప్రయత్నించాలన్నారు.
ప్రజల ఆరోగ్యం కొరకు సువన్ ఫార్మా చేపడుతున్న వైద్య శిబిరాలు అభినందనీయమని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంపెనీ హెచ్ ఆర్ సీనియర్ మేనేజర్ బి వెంకటరమణ, డిప్యూటీ మేనేజర్ దుస్సా సైదులు, ఇ హెచ్ ఎస్ పివి రమణ, మెయింటెనెన్స్ ఎం శ్రీనివాసరావు, ప్రొడక్షన్ పి సతీష్, టి మధు, బి కృష్ణ, జీవన్ నాయక్, ఓ హెచ్ సి డి విజయ, బెల్లి విజయ, సువేన్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.