25-02-2025 07:09:05 PM
కలెక్టర్ జితేష్ వి పటేల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన తీవ్రమైన ఎండ వడదెబ్బపై జిల్లా ట్రాన్స్పోర్ట్ మీటింగ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... వివిధ శాఖల వారి యొక్క ప్రణాళికలను తీవ్రమైన ఎండ వడదెబ్బలకు ప్రజలు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసరం ఉంటేనే తప్ప బయటకు రాకూడదని ముఖ్యంగా, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు బయటకు వెళ్లకూడదని సూచించారు.
ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశంలో గ్రీన్ షేడ్ నెట్స్ లేదా టెంట్స్ వేయించాలని త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఆశ వర్కర్స్ వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను తగినంత ఉంచుకొని ప్రజలకు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎండ తీవ్రతను ఎదుర్కొనుటకు తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్స్ పాంప్లెట్స్ లను ఆవిష్కరించారు. వీటిని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎల్ భాస్కర్, DWO శ్రీమతి లెనినా గారు, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ వి మధువరన్, ఇతర జిల్లా స్థాయి ఉన్నత అధికారులు పాల్గొన్నారు.