calender_icon.png 7 March, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

07-03-2025 12:42:06 AM

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ 

గద్వాల, మార్చి 06 (విజయక్రాంతి): సాంప్రదాయ చేతివృత్తుల వారు ఆర్థికంగా మరింత స్థిరపడేందుకు రూపొందించిన పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సూచించారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో పీఎం విశ్వకర్మ పథకంపై ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కలె  మాట్లాడుతూ అంతరించిపోతున్న చేతి, కుల వృత్తుల వారికి చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ  పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు.  కులవృత్తులపై ఆధారపడి జీవిం  వారిలో సామర్థ్యాన్ని పెంచి, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉత్పాదకత, నాణ్యత, ఉత్పత్తులను మెరుగుపరచి, ఆర్థికంగా చే యూతనిస్తూ జీవనోపాధిని అభివృద్ధి చేయడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, మంగలి, ఉప్పరి, ఎరుకల, దర్జీ తదితర 18 కుల వృత్తుల వారికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాల ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శిక్షణతో పాటు రుణాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకంలో చేరడం ద్వారా విశ్వకర్మ సర్టిఫికెట్, ఐడి కార్డుతో పాటు నైపు ణ్యాభివృద్ధి శిక్షణ, టూల్ కిట్లు, రుణ సదుపాయం, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం, మార్కెటింగ్‌కు మద్దతు లభిస్తుందని తెలిపారు. 

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రామలింగేశ్వర్ గౌడ్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రుజైస్ ఏడి శివ రామ్ ప్రసాద్, ఢిల్లీ ప్రతినిధి సంజీవ్ కు  సైని, ఇంచార్జ్ డి.పి.ఓ నాగేంద్రం, ఎల్డియం అయ్యపు రెడ్డి , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు,చేనేత మరియు జౌళి శాఖ ఎ.డి గోవిందయ్య పాల్గొన్నారు.