calender_icon.png 25 March, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

24-03-2025 12:06:37 AM

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులు 

పంపిణీ చేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు 

గద్వాల, మార్చి 23 ( విజయక్రాంతి) :  ప్రభుత్వ ప్రకారం గా అందించే సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 361 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, 161 మంది భాదితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల పెళ్లి కానుకగా ప్రభుత్వం లక్ష 116 రూపాయలు ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన కళ్యాణ లక్ష్మి,  షాదిముబారక్,  సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులు సకాలంలో బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహశీల్దారులు రెవెన్యూ సిబ్బంది,బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.