కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 9 మంది లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ జిల్లా అధ్యక్షుడు అంతంపల్లి చిట్టేడి సుధాకర్ రెడ్డి లబ్ధిదారులు పాల్గొన్నారు.