రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి, (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండల కేంద్రం లో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి 43 లక్షలతో నిర్మించనున్న భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం 7 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆశించినట్లు గానే పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు,బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ,కృష్ణారెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.