calender_icon.png 24 January, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దు: మంత్రి ఉత్తమ్

23-01-2025 10:51:04 PM

కోదాడ (విజయక్రాంతి): రేషన్ కార్డు విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. గురువారం కోదాడ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, పాలకవర్గం సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. ఈనెల 26తేదీ నుండి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదన్నారు. పది సంవత్సరాలుగా 40వేల రేషన్ కార్డులకు యాడింగ్ చేయడం జరిగిందన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) మాట్లాడుతూ... రాష్ట్రంలో కీలకమైన పాత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రజల ప్రభుత్వం అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుంది. పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) చేసింది ఏంటి అని మండిపడ్డారు. గోదావరి జలాలు పాలేరుకి వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి తుమ్మల కోరారు. ఎమ్మెల్యే పద్మావతి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతమ్మ, వైస్ చైర్మన్ బషీర్, పాలకవర్గం పాల్గొన్నారు.