కమాన్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ యువనేత దుద్దిళ్ల శ్రీను బాబు పిలుపు
మంథని (విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో (డిసెంబర్ 4) బుధవారం నిర్వహించనున్న యువ వికాస్ నిరుద్యోగ, యువశక్తి, విజయోత్సవ సభకు మంత్రి నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు, కాంగ్రెస్ పార్టీ యువనేత దుద్దిళ్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. మంగళవారం కమాన్ పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎస్ఎస్ అన్వర్ నివాసంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మండల అధ్యక్షులు వైనాల రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో శ్రీను బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు, కౌలు రైతులు, మహిళలు, యువతి, యువకులు అన్ని వర్గాల ప్రజలు పెద్దపల్లి సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని శ్రీను బాబు పిలుపునిచ్చారు.