రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా ప్రజలు అప్రమ సంఘ ఉండాలని కలెక్టర్ శశాంక సూచించారు. అవసరం అయితేనే తప్ప బయటకి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యంత్రాంగం మొత్తం గా ఉందని ఆయన పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం బండ్ల గూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడి పలువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న నీటిమట్టం ఎంత ప్రస్తుతం ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఇప్పటిలోపు హిమాయత్ సాగర్ చెరువు నిండిపోతుంది అని అడిగి తెలుసుకున్నారు. హిమాయత్ సాగర్ వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటరెడ్డి, రాజేంద్రనగర్ తహసిల్దార్ రాములు, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, జలమండలి అధికారులు పాల్గొన్నారు.