calender_icon.png 20 April, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ కల్లు సేవించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

19-04-2025 11:12:43 PM

ఆంటీ, నార్కోటిక్ బ్యూరో, డీఎస్పీ శివన్ నాయుడు

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కల్తీ కల్లు, యాంటీ డ్రగ్ సేవించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్కటిక్ బ్యూరో డిఎస్పి శివన్ నాయుడు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి  మండలంలోని గండిమాసానిపేట, వెల్లుట్ల, రుద్రారం గ్రామాల్లో  కల్తీ కల్లు ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని నివారించేందుకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా యువతను మత్తు వ్యసనాల పాలుపడకుండా ఉండేలా చేయడం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమాలు పట్టణ, గ్రామస్థాయిలోనే నిర్వహి ఇస్తున్నట్లు తెలిపారు.

అనంతరం ఈ కార్యక్రమానికి ఆంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ శివన్ నాయుడు  ముఖ్య అతిథిగా హాజరై, కల్తీ కల్లు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలను గ్రామస్తులకు వివరించారు. మత్తువల్ల కుటుంబాలు ఎలా విధ్వంసమవుతున్నాయో, జీవనశైలి ఎలా నాశనమవుతున్నదీ వాస్తవ సంఘటనలతో, ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. “కల్తీ కల్లు, గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటోంది. గ్రామం నుంచి పట్టణం వరకు ప్రతి ఒక్కరూ చురుకుగా సహకరించాలి,” అని ఆయన పేర్కొన్నారు.

అనంతరం ఎల్లారెడ్డి పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి గాంధీ చౌక్ కొరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం గాంధీ చౌక్ లో మానవహారం కల్తీకల్లు పై ప్రతి ఒక్కరు నిషేధించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ ఏ. సుందర్ సింగ్, ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, ఎస్‌ఐ బి. మహేష్, ఎల్లారెడ్డి మునిసిపల్ కమిషనర్ మహేష్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్ కుమార్, గ్రామ సచివాలయ సిబ్బంది, స్థానిక యువత, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.