calender_icon.png 5 April, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

01-04-2025 08:52:30 PM

బెట్టింగ్, గేమింగ్ కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..

భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రభాకర్..

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, ఐపీఎల్ బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రభాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న  భ్రమలో యువత, ప్రజలు విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ లకు బానిసలుగా మారి, అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, ఆన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, ప్లే కార్డ్, గేమ్స్ కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

అలాగే ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్స్ వల్ల యువత ఆర్థికంగా దెబ్బతిని, చివరికి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, బెట్టింగ్ లకు యువత దూరంగా ఉండాలని తెలిపారు. ఐపిఎల్ బెట్టింగ్ నిర్వహించే వారిపై పోలీస్ నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ కిరణ్ పేర్కొన్నారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని, ప్రతి రోజూ పిల్లలు వారు చేస్తున్న పనుల గురించి ఆరా తీయాలని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్, ప్లేయింగ్ కార్డ్స్, బెట్టింగ్ యాప్స్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కిరణ్ ఖరే ప్రభాకర్ హెచ్చరించారు.

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల నిర్వహకుల మార్గదర్శకంలోనే బెట్టింగ్ లు ఆపరేట్ చేయబడతాయని, బెట్టింగ్ యాప్ లలో డబ్బులు పెట్టుబడిగా పెట్టి, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనీ, ఎస్పీ సూచించారు. బెట్టింగ్ యాప్ ల డౌన్ లోడ్ ద్వారా ప్రజల వ్యక్తి గత సమాచారం, అకౌంట్ వివరాలు, సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి, బెట్టింగ్ సంబంధిత సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ కిరణ్ ఖరే ప్రభాకర్ తెలిపారు.