calender_icon.png 3 April, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

02-04-2025 12:00:00 AM

పోలీసుల అవగాహన

మద్నూర్, ఏప్రిల్01 (విజయ క్రాంతి) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల ప్రజలకు మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ వారి సూచనలు పాటించాలని ప్రజలను కోరారు. దొంగతనా లు కాకుండా ప్రజలు జాగ్రత్త గా ఉండాలని, దొంగతనాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  ప్రజలకు అవగాహన కల్పించారు. మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ఆవరణంలో ఆటోకు మైకు కట్టి దొంగతనాల పట్ల జాగ్రత్త పడవలసిన వాటి గురించి ప్రజలకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముంద ర ఎలాంటి వాహనాలు పెట్టుకున్నా, పశువులు ఉన్న, ఇతర వస్తువులు నిలువ చేసుకు న్న అలాంటి వాటి పట్ల దొంగతనాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపా రు. ఫోన్ ద్వారా ఎలాంటి కాల్ వచ్చినా ఇతరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకూడద ని, గ్రామాల్లో గల్లీలలో ఎవరైనా వస్తే అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనుమానితులుగా కనిపిస్తే పోలీ స్ శాఖకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు . ఈ నేపథ్యంలో ప్రచార అవగాహన చేస్తున్న పోలీసులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.