పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): నగరం లో కురుస్తున్న వర్షాలకు సాగర్‌లో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న క్రమంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ సాగర్ ఎఫ్‌టీఎల్‌ను క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. సాగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. అశోక్‌నగర్, విద్యానగర్‌లోని పద్మానగర్ కాలనీలో అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జీహెచ్ ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ హుస్సేన్ సాగర్ గేట్లను, తూములను పరిశీలించారు.
610 బృందాలతో సహాయక చర్యలు..
హుస్సేన్ సాగర్ వద్ద పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ మీడియాతో మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ, హైడ్రా, జలమండలి,హెచ్‌ఎండీఏకు చెందిన సుమారు 610 సహాయక బృందాలు నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలలో నిమగ్నం అయ్యాయని తెలిపా రు. అల్లాపూర్, కూకట్‌పల్లి మినహా గ్రేటర్‌లో ఆస్తి, ప్రాణ, నష్టం జరగలేదన్నారు. అల్లాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాలలో సుమారు 60 ఇండ్లు నీట మునిగాయని, ఆ ప్రాం తాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావ ద్దని ప్రజలకు సూచించారు.