17-04-2025 01:21:12 AM
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కోటాచలం
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఏప్రిల్ 16: వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి, ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందు బాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశా ఖాధికారి డాక్టర్ కోటాచలం సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీ లించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో సహజ కాన్పులు జరిగే విధంగా గర్భిణీలకు సలహాలు, సూచ నలు అందిస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందే ప్రయోజనాల గురించి అవ గాహన కల్పించాలని చెప్పారు.ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలని, వి ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖా ప రంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చ రిం చారు. మండల వైద్యాధికారి డాక్టర్ భూ క్య నగేష్ నాయక్, సీహెచ్‌ఓ మాలోతు బిచ్చు నాయక్, సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీ సర్ సునీత, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.