16-04-2025 01:47:44 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, ఏప్రిల్ 15 (జయ క్రాంతి): భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టంపై సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి భూ సమస్యల శాశ్వత పరిష్కా రానికి ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొం దించిందని అన్నారు.
భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 17వ తేదీ నుంచి ప్రతి మండలంలో భూభా రతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ రూపకల్పన చేయాలన్నారు. ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో భూ భారతి చట్టంపై ప్రజలకు సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్, అన్ని మండలాల తహసిల్దార్లు పాల్గొన్నారు.
జగిత్యాలలో.. కలెక్టర్ బి.సత్యప్రసాద్
జగిత్యాల, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ’భూభారతి’పై జిల్లా వ్యాప్తంగా గల రైతులకు అధికారులు పరిపూర్ణమైన అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బి.ఎస్.లత ’భూ భారతి’ చట్టం అమలుపై మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ తెలంగాణ ప్రజల భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వం నూత నంగా తీసుకొచ్చిన భూ భారతి, ఆర్వోఆర్ చట్టంపై విస్తృతంగా ప్రచారం చేసి సంబంధిత రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
ప్రజా వాణి దరఖాస్తుల ను ఇకపై ప్రతి వారం సీఎం స్క్రూటినీ చేయడం జరుగుతుందని, వాటి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికా రులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవా లన్నారు. భూ భారతి చట్టంపై తహసిల్దార్లు రెవెన్యూ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. భూ భారతి చట్టం యొక్క గెజిట్, రూల్సు రెవెన్యూ శాఖలోని ప్రతీ అధికారి తెలుసుకోవాలన్నారు.
రోజుకు కనీసం 2 అవగాహన కార్యక్రమాలు జరగా లని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అవగాహన కార్యక్రమాలు విధిగా నిర్వహిం చాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, ఇతర ప్రముఖులు, ప్రజలు సమా వేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలె క్టర్ సూచించారు. జగి త్యాల జిల్లాలో భూ భారతి చట్టం అమలుకు అధికా రులు సన్నద్ధం కావాలని, భూమి సమస్యల పరిష్కారానికి పటిష్ట కార్యాచరణ రూపొం దించాలన్నారు.
ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరిం చాలన్నారు. ప్రభుత్వ భూముల ఫెన్సింగ్, మార్కింగ్ ప్రక్రియను తహసిల్దార్లు త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూధన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, పలువురు మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
విస్తృత ప్రచారం కల్పించాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఏప్రిల్ 15(విజయ క్రాంతి) : తెలంగాణ ప్రజలకు ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వం నూతనంగా తీసుకుని వచ్చిన భూ భారతి ఆర్వోఆర్ చట్టం పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కోయ శ్రీ హర్ష భూ భారతి చట్టం అమలు పై అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలె క్టర్ మాట్లాడుతూ సిఎం ప్రజావాణి దరఖా స్తులను ఇంకా నుంచి ప్రతి వారం స్క్రూటి నీ చేయడం జరుగుతుందని, వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలి పారు.
భూ భారతి చట్టం పై తహసిల్దారు లు రెవెన్యూ అధికారులు సంపూర్ణ అవగా హన కలిగి ఉండాలని, భూ భారతి చట్టం యొక్క గెజిట్, రూల్స్ ను రెవెన్యూ శాఖ లో ప్రతి అధికారి తెలుసుకోవాలని, భూ భారతి చట్టంలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని, భూ పరిధి చట్టం ప్రకారం ఇకపై రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసే సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి అవుతుందని, ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు నూతన భూ భారతి ఆర్వోఆర్ చట్టం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, దీనికి సంబంధించిన షెడ్యూలు, వెన్యూ లను తయారు చేసుకోవాలని సూచించారు.
ప్రతి రోజు కనీసం 2 అవగాహన కార్యక్రమాలు జరగాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు , ఇతర ప్రజలు ఈ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. భూ భారతి చట్టం ముం దస్తుగా రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించి, అక్కడ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరించి జూన్ నెలలో పట్టాలు పంపిణీ చేసి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పెద్దపల్లి జిల్లాలో భూ భారతి చట్టం అమలుకు అధికారులు సన్నద్ధం కావాలని, ప్రజల భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట కార్యాచరణ రూపొందించాలని, ప్రస్తుతం మన వద్ద పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, ప్రభుత్వ భూముల ఫెన్సింగ్, మార్కింగ్ ప్రక్రియను తహసిల్దార్ లు పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, సురేష్, తహసిల్దార్ లు, సంబంధిత ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.