26-04-2025 10:01:18 PM
సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్
కొండపాక: తరిగిపోతున్న నీటి వనరులు, వాతావరణ మార్పుల కారణంగా నీటి కొరత ఏర్పడకుండా జిల్లా స్థాయిలో వాచ్ డాగ్ కమిటీలు పనిచేయాలని శనివారం ఐడిఓసి మినీ సమావేశ మందిరంలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గరీమా అగర్వాల్ మాట్లాడుతూ... జిల్లా ప్రజలకు నీటి సమస్య లేకుండా, చూడాలని అధికారులను ఆదేశించారు.
భవన నిర్మాణాల అనుమతులకు ముందు 300,చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న అన్ని భవనాలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కలిగి ఉండాలని, 10వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న భవనాలలో 100 కంటే ఎక్కువ యూనిట్లు ఉన్నా గ్రూప్ హౌస్ లకు వ్యర్థ జలాల రీసైక్లింగ్ ప్లాంట్ ను కలిగి ఉండేలాని, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లు, ప్రభుత్వ హాస్టల్లో, అన్ని ప్రభుత్వ భవనాల లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలని, వాచ్ డాగ్ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎక్కువ నీరు వృధా జరిగే ప్రదేశాలు భవనాలను గుర్తించి నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
పట్టణ స్థానిక సంస్థలలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ సర్వే నిర్వహించి నివేదిక అందించాలని, అవసరమైన చోట వాల్టా చట్టాన్ని అమలు చేయాలని తెలిపారు. నీటి సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలకు నల్లాల ద్వారా మంచినీటిని అందించాలని అన్నారు. ఏప్రిల్ నెలలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ముగుస్తుందని, వచ్చిన దరఖాస్తులపై చర్యలు వేగవంతం చేయాలని, ఎల్-1 అనుమతులు పూర్తి చేయాలని,ఎల్ -2,ఎల్ -3 లపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ దేవకీదేవి, ఆర్డీవో జయదేవ్ ఆర్య, మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.