calender_icon.png 27 November, 2024 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ క్రైమ్ నేరాల బారినుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

26-11-2024 10:42:10 PM

డీ.జియం ఘన్ శ్యామ్ సోలంకి

మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు పట్ల జాగ్రత్త వహించండి:డి.జీయం

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పోస్టాఫీసు పి.ఆర్ ఫంక్షన్ హాల్ నందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాల పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా డీ.జియం ఘన్ శ్యామ్ సోలంకి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇప్పుడు సైబర్ క్రైమ్ నేరాల రోజు రోజు కీ పెరిగిపోతున్నాయి వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా ఈ రోజుల్లో ప్రజలు సైబర్ నేరగాళ్లు  కస్టమ్స్ వద్ద పార్శిల్ చిక్కుంది,మి పేరు మీద క్రెడిట్ కార్డు జారీ చేయబడింది.

పొరపాటున డబ్బు బదిలీ చేయబడింది, kyc గడువు ముగిసింది, కుటుంబ సభ్యున్ని అరెష్ట్ చేశారు, డిజిటల్ అరెస్టు చేయడం, స్టాక్స్ ట్రేడింగ్ చేయడం ద్వారా ధనవంతులు అవ్వండి, సులభమైన పనుల నుండి పెద్ద మొత్తంలో సంపాదించండి అని పలు పలు విధాలుగా మీకు ఫోన్ చేసి మీ దగ్గర డబ్బులు కజేస్తున్నారు, కావున స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ జాగ్రత్తగా ఉండాలాన్నారు. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏదైనా చర్య తీసుకునే ముందు వివరాలు పరిశీలించండి, అనుమానాస్పద లింకుల్ని క్లిక్ చేయకండి, తెలియని షేరింగ్ యాప్స్ నీ డౌన్ లోడ్ చేయకండి.

ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడితే తక్షణం 1930 లేదా cybarcrime.govt.in కి తక్షణం పిర్యాదు చేస్తే మి యొక్క డబ్బు 100% రికవరి అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ కి సంబంధించి వివరాలకు 18001234 నంబర్ కి ఫోన్ చేయండి, బ్యాంక్ కి వెళ్లి లేదా విడియో KYC ద్వారా KYC నీ అప్డేట్ చేయండి, మీ CIF, అకౌంట్ నంబర్, కార్డు నంబర్, సివివి, ఓటిపి ఎవరికి చెప్పకండి. బెదిరింపులకు మోసపోవద్దు, అత్యాశకు పోయి నష్టాలు తెచ్చుకోవద్దు, అధిక మొత్తంలో అదాయన్నిచ్చే స్కాముల విషయంలో జాగ్రత్తలు వహించండనీ డి.జియం ఘన్ శ్యామ్ సోలంకి తెలిపారు. ఈ కార్యక్రమములో ఆర్.యం సత్యనారాయణ, సీయం అబ్దుల్ యజాజ్ ఖాన్, బ్యాంక్ మేనేజర్లు, సింధు భావన, రవి కుమార్, పవన్ కుమార్, ప్రవీణ్ కుమార్, వినోద్ కుమార్, బ్యాంక్ సిబ్బంది, రిటర్డ్ కాస్టమర్ల్ పాల్గొన్నారు.