calender_icon.png 16 January, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: భట్టి విక్రమార్క

31-08-2024 04:16:18 PM

ఖమ్మం (విజయక్రాంతి): గత మూడు, నాలుగు రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు  ప్రజలను శనివారం ఒక ప్రకటనలో కోరారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని అందువలన అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుండి బయటకు రావాలని, విద్యుత్ స్తంభాలు తాకరాదు అని భట్టి విక్రమార్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎదైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని తక్షణమే అధికారులు వారికి కావాల్సిన సహాయ చర్యలు తీసుకుంటారని తెలిపారు.