calender_icon.png 28 September, 2024 | 3:06 PM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జడ్పీ సీఈఓ గణపతి

09-09-2024 01:39:51 PM

మంచిర్యాల విజయ క్రాంతి : వర్షాలు నిరంతరంగా కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ సీఈవో, జైపూర్ మండల ప్రత్యేక అధికారి గణపతి అన్నారు. సోమవారం జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ పంచాయతీనీ సందర్శించి గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని, నీరు నిల్వ లేకుండా చూడాలని, దోమలు ఈగల ద్వారా ప్రజలు వ్యాధుల భారిన పడే అవకాశం ఉన్నందున ఫాగింగ్ చేయించాలని పంచాయితీ కార్యదర్శి కి సూచించారు. గోదావరి ఖని - ఇందారం మధ్య గల గోదావరి నది ఉదృత్తిని పరిశీలించారు. ప్రజలు ఎవరు కూడా గోదావరి వైపు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా చూడాలని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రావద్దని సూచించారు. సీఈవో వెంట ఆర్ డబ్ల్యూ ఎస్ డిప్యూటీ డిఇ విద్యాసాగర్, మండల పంచాయితీ అధికారి శ్రీపతి బాపు రావు, పంచాయితీ కార్యదర్శి ఏ సుమన్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.