calender_icon.png 16 January, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

31-08-2024 02:52:38 PM

తుంగతుర్తి సిఐ శ్రీనివాస్ నాయక్..

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుఫాను కారణంగా తుంగతుర్తి మద్దిరాల నూతనకల్ మండల ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకి రావద్దని ప్రజలకు సీఐ శ్రీనివాస్ నాయక్, తెలిపారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్లలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, చెరువుల వద్దకి చేపలవేట కోసం ఈతకు వెళ్లొదు, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. పాత ఇంటిలో మట్టి గోడల ఇంటిలో నివాసం ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలి,కరెంటు స్తంభాలను తాక రాదు, అత్యవసర సమయంలో100కు కాల్ చేయాలని సిఐ సూచించారు.