రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు
మంథని: భారీ వర్షాలకు పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలు, మంథని నియోజకవర్గ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరినది పరివాహక ప్రాం తాల్లో, కాలువ లు చెరువుల ప్రాంతాల్లో పశువులను, మేకలను మేపడాని, చేపలు వేటకు గాని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళవద్దని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.