calender_icon.png 28 April, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

26-04-2025 12:00:00 AM

రెండు కుక్కలపై దాడి చేసిన చిరుత

దౌల్తాబాద్, ఏప్రిల్ 25: వడ్డేపల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి మరోసారి కలకలం రేపింది. రెండు కుక్కలపై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటనను గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్, బీట్ ఆఫీసర్ వేణు లు చేరుకుని చిరుతపులి పాదముద్రలు పరిశీలించి చిరుతపులిగా గుర్తించా రు. అడవిలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని, చిరుత పులి ఒకే చోట నివాసం ఉండదని తరచూ తిరుగుతుంటుందని తెలిపారు. అడవికి దగ్గర వ్యవసాయ పొలాలు ఉన్న రైతులు గొర్రెలు, మేకలు, పశువులను పొలాల వద్ద ఉంచకుండా ఇళ్లలోకి తీసుకొచ్చుకోవాలన్నారు. చిరుత పులి కనిపిస్తే వెం టనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులెవ్వరు పొలాల చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకోవద్దని తెలిపారు.