01-04-2025 10:45:45 PM
జుక్కల్ ఎస్సై భువనేశ్వర్...
జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాండ్లపట్ల జాగ్రత్తగా ఉండాలని జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ వినియోగం వలన చాలా రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, ఇతర నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. వీటి వినియోగం వల్ల యువత తప్పు ద్రోవ పడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఆదివారం జుక్కల్ గ్రామంలోని అంగడిలో ఫోన్ల దొంగతనం గురించి ఫిర్యాదులు వస్తున్నాయని, ఇందులో కొన్నింటిని పోగొట్టుకున్న వ్యక్తులకు అప్పగించడం జరిగిందని, ఇంకొన్ని వాటిని గుర్తించే వాటిలో పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేపడుతున్నామని త్వరలోనే ఆ ఫోన్లను పోగొట్టుకున్న వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. దీంతోపాటు ప్రజలు వేసవికాలం అయినందున పలు శుభకార్యాలకు వెళ్లే క్రమంలో ఇంటికి తాళం వేసి పక్కింటి వారికి చెప్పి వెళ్లాలని సూచించారు. విలువైన వస్తువులు ఇంట్లో జాగ్రత్తగా ఉంచాలన్నారు.